Kiaraa Advani – Sidharth Malhotra | బాలీవుడ్ కపుల్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా త్వరలోనే తాము తల్లిదండ్రులు అవ్వబోతున్నట్లు శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా తమ రెండు చేతులు ముందుకు చాచి చిన్నారి సాక్స్ ఫొటో పంచుకున్నారు. మా జీవితాల్లోకి గొప్ప బహుమతి త్వరలో వస్తుంది అంటూ ఈ ఫొటోకి క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు, సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలావుంటే తాము పేరెంట్స్ అవ్వబోతున్నట్లు మరో ఫొటోను పంచుకుంది ఈ జంట. ఇందులో కియారా బ్లాక్ కలర్ పోల్కా డాట్ డ్రెస్ ధరించి ఉంది.
అయితే ఈ డ్రెస్‌కి సంబంధించి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక ట్రెండ్ నడుస్తుంది. ఎవరైన హీరోయిన్ బ్లాక్ కలర్ పోల్కా డాట్ డ్రెస్(Polka Dot Dress) ధరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టిందంటే ఆమె ఖచ్చింతంగా తల్లి కాబోతుందని అర్థం అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనికి ఉదాహరణగా ఇంతకుముందు హీరోయిన్లు ఈ డ్రెస్ ధరించి తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. ఒక ఎవరెవరు ఈ ట్రెండ్ ఫాలో అయ్యారు అనేది చూసుకుంటే..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కా శర్మ – విరాట్ కోహ్లీ దంపతులు తాము తల్లిదండ్రులు అవ్వబోతున్నట్లు ప్రకటించినప్పుడు అనుష్కా శర్మ బ్లాక్ కలర్ పోల్కా డాట్ డ్రెస్ ధరించింది. అనంతరం ప్రియాంక చోప్రా కూడా తాను తల్లి అయ్యేముందు ఈ డ్రెస్ ధరించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత ఆలియా భట్.. రీసెంట్గా కియారా అద్వానీ కూడా తాను తల్లి అవుతున్నానని చెబుతూ పోల్కా డాట్ డ్రెస్ ధరించి అందరికి హింట్ ఇచ్చింది. ఇంకా వీరే కాకుండా షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్, ఇంగ్లాండ్ యువరాణి కేట్ మిడిల్టన్ తదితరులు కూడా గర్భవతి సమయంలో పోల్కా డాట్ డ్రెస్ ధరించారు. అయితే ఈ ట్రెండ్‌ను ప్యూచర్లో మరింతమంది హీరోయిన్లు ఫాలో అయ్యేటట్లు తెలుస్తుంది.
Alia Bhatt
Hardik Pandya
Kareena Kapoor Khan
Mira Rajputh
Priyanka Chopra
Virushka Polka Dot Dress