‘మా ఊరి పొలిమేర’ ‘పొలిమేర-2’ చిత్రాలకు కొనసాగింపుగా ‘పొలిమేర-3’ తెరకెక్కనుంది. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, భోగేంద్రగుప్తా నిర్మించనున్నారు. త్వరలో ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల తదితరులు చిత్ర తారాగణం.