రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా నటిస్తున్న ‘పోలీస్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్’ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గొల్లపాటి నాగేశ్వరరావు దర్శకత్వంలో విశ్వేశ్వర శర్మ, రాజరాయ్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు చందు మొండేటి క్లాప్‌నివ్వగా, ప్రసన్నకుమార్ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సస్పెన్స్, యాక్షన్, డ్రామా కలబోసిన కథాంశమిది. ఏప్రిల్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అన్నారు. ఇతర నటీనటుల వివరాల్ని త్వరలో తెలియజేస్తామని నిర్మాత పేర్కొన్నారు. మంత్ర ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: గొల్లపాటి నాగేశ్వరరావు.