Police Complaint Review | ‘కర్మ’ సిద్ధాంతంతో సాగే ఇన్వెస్టిగేషన్.. వరలక్ష్మి, నవీన్ చంద్రల ‘పోలీస్ కంప్లైంట్’ ఎలా ఉందంటే?
Police Complaint | టాలీవుడ్ వెండితెరపైకి హారర్, థ్రిల్లర్ అంశాలతో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చేసింది. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’.
Police Complaint | టాలీవుడ్ వెండితెరపైకి హారర్, థ్రిల్లర్ అంశాలతో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చేసింది. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్-యాక్షన్ థ్రిల్లర్ తాజాగా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథ అండ్ విశ్లేషణలో తెలుసుకుందాం.
కథ
ఒక గర్భిణి మహిళ దారుణ హత్యతో ఈ కథ ప్రారంభమై ప్రేక్షకులను మొదటి సన్నివేశం నుంచే ఉత్కంఠలోకి నెడుతుంది. క్షుద్రపూజల నేపథ్యంలో జరిగినట్లు అనుమానిస్తున్న ఈ హత్య కేసు, సరైన ఆధారాలు లేక సంవత్సరాల పాటు మూలన పడిపోతుంది. అయితే, ‘అద్వైత’ అనే చిన్నారి “నాకు డాడీ కావాలి” అంటూ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఆ పాప ఎవరినైతే ‘డాడీ’ అని పిలుస్తుందో, వారంతా ఒక్కొక్కరుగా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ వరుస మరణాల మిస్టరీని ఛేదించడానికి ఒక నిబద్ధత గల పోలీస్ అధికారిణి (వరలక్ష్మి శరత్‌కుమార్) రంగంలోకి దిగుతుంది. కేసు విచారణ ముమ్మరం చేస్తున్న క్రమంలో, ఆమె భర్త డాక్టర్ రామ్ (నవీన్ చంద్ర) అసలు రూపం బయటపడుతుంది. అప్పుడు ఆ పోలీస్ అధికారిణి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఈ వరుస హత్యల వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? ఈ మరణాలకు అతీంద్రియ శక్తులే కారణమా? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ. విచారణలో మూఢనమ్మకాలు, అవినీతి, దాచిపెట్టిన నేరాలతో పాటు ‘కర్మ సిద్ధాంతం’ వంటి ఆసక్తికరమైన అంశాలు బయటపడతాయి. చివరికి నిజం ఏంటనేది ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌లో వెల్లడవుతుంది.
విశ్లేషణ:
దర్శకుడు సంజీవ్ మేగోటి చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ (కర్మ సిద్ధాంతం) అనే వినూత్నమైన కాన్సెప్ట్‌ను హారర్ థ్రిల్లర్ రూపంలో తెరపై ఆవిష్కరించడంలో విజయం సాధించారు. కథలో హారర్, మిస్టరీ, యాక్షన్ ఎలిమెంట్స్‌ను ఆయన సమతుల్యంగా మేళవించారు. సినిమా మొదటి భాగం అంతా మిస్టరీ ఎలిమెంట్స్‌తో సాగగా, ఇంటర్వెల్ తర్వాత కథనంలో వేగం పెరుగుతుంది. కేసు దర్యాప్తులో ఒక్కొక్కటిగా బయటపడే రహస్యాలు ప్రేక్షకులను చివరి వరకు సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి. ముఖ్యంగా హారర్ సన్నివేశాలు, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
నటీనటుల ప్రతిభ:
నవీన్ చంద్ర తన పాత్రలో అద్భుతమైన, సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. దర్యాప్తుకు సంబంధించిన కీలక సీన్లలో అతని స్క్రీన్ ప్రెజెన్స్ కథకు బాగా ప్లస్ అయింది. వరలక్ష్మి శరత్‌కుమార్ పోలీస్ అధికారిణిగా మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా క్లిష్టమైన భావోద్వేగ సన్నివేశాలలో ఆమె నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. కృష్ణసాయి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అలాగే, టాలీవుడ్ సూపర్‌స్టార్ కృష్ణకు నివాళిగా చిత్రంలో పొందుపరిచిన ప్రత్యేక గీతంలో ఆయన ప్రదర్శన అభిమానులను విశేషంగా అలరిస్తుంది. రాగిణి ద్వివేది గ్లామర్‌తో పాటు కథకు అవసరమైన ప్రాధాన్యత ఉన్న పాత్రలో మెప్పించారు. ఇతర నటీనటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి తమదైన శైలి కామెడీతో మంచి రిలీఫ్ అందించారు. వరలక్ష్మితో పాటు పోలీసు పాత్రల్లో నటించిన జెమిని సురేష్, విజయభాస్కర్ సరదాగానూ, సీరియస్‌గానూ సాగే పాత్రల్లో చక్కటి నటనను కనబరిచారు.
సాంకేతిక విభాగం:
ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప ఛాయాగ్రహణం (సినిమాటోగ్రఫీ) ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రాత్రి వేళల్లో వచ్చే సీన్లు, హారర్ ఎపిసోడ్స్‌ను ఆయన విజువల్‌గా చాలా అద్భుతంగా కెమెరాలో బంధించారు. ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో అందించిన నేపథ్య సంగీతం (BGM) హారర్ వాతావరణాన్ని మరింత రక్తికట్టించింది. అనుగోజు రేణుకా బాబు ఎడిటింగ్ కథనాన్ని గ్రిప్పింగ్‌గా నడిపించడంలో సహాయపడగా, వీఎఫ్ఎక్స్ (VFX), సౌండ్ డిజైన్ థ్రిల్లర్ అనుభూతిని మరింత పెంచాయి.
ప్లస్ పాయింట్స్ (Plus Points):
ఆసక్తికరమైన కథా నేపథ్యం
ఆకట్టుకునే హారర్ – థ్రిల్లర్ ఎలిమెంట్స్
నవీన్ చంద్ర, వరలక్ష్మి శరత్‌కుమార్ లీడ్ పర్ఫార్మెన్స్
మెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
సూపర్‌స్టార్ కృష్ణ నివాళి గీతం
క్లైమాక్స్ ట్విస్ట్
తీర్పు:
హారర్, యాక్షన్, థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడే ప్రేక్షకులకు ‘పోలీస్ కంప్లైంట్’ ఒక మంచి థియేట్రికల్ అనుభూతిని ఇస్తుంది. మూఢనమ్మకాల నేపథ్యంలో కర్మ సిద్ధాంతాన్ని జోడించి చెప్పిన ఈ థ్రిల్లింగ్ కథ ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది.
రేటింగ్: 3/5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

