మహేశ్ బాబు (Mahesh Babu) కు బిగ్గెస్ట్ బ్రేక్ అందించి లీడింగ్ స్టార్ హీరోగా నిలబెట్టింది.. అప్పటివరకున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది పోకిరి (Pokiri) . పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ ఆల్ టైమ్ ఫేవరేట్ సినిమా వచ్చి దశాబ్దమున్నర కాలం దాటిపోతుంది. ఇంతకాలమైనా ఈ సినిమాను ఎప్పుడు చూసినా ప్రతీ ఫ్రేమ్ చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుంటుంది. మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా అభిమానులు పోకిరి (4K UHD) వెర్షన్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
దీనికి సంబంధించి ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. తాజా అప్డేట్ ప్రకారం ఆగస్టు 9న కాలిఫోర్నియాలో పోకిరి స్పెషల్ షో ప్లాన్ చేశారు. ఆశ్చర్యకర విషయమేంటంటే బుకింగ్స్ మొదలైన గంటలోపే టికెట్స్ అన్నీ అమ్ముడుపోయాయి. మహేశ్ బాబు సినిమాలకు ఏ రేంజ్లో క్రేజ్ ఉంటుందో ఈ ఒక్క విషయంతో తెలిసిపోతుంది.
అభిమానులు మరో షో కూడా వేయాలని సన్నాహాలు చేస్తుండగా..త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ షురూ కానున్నాయట. పోకిరి మహేశ్‌ను మాస్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇలియానా హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. పోకిరిలో ఒక్కో పాట ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.