Lucky Baskhar 2 | ‘లక్కీ భాస్కర్’కి సీక్వెల్.. అధికారికంగా ప్రకటించిన దర్శకుడు!
Lucky Baskhar 2 | మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన 'లక్కీ భాస్కర్' చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.
Lucky Baskhar 2 | మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ను స్వయంగా దర్శకుడు వెంకీ అట్లూరి వెల్లడించడంతో సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం ‘ఐయామ్ గేమ్’ (I’m Game) ప్రమోషన్లలో భాగంగా దుల్కర్, వెంకీ అట్లూరి ఒకే వేదికపై సందడి చేశారు. ఈ సందర్భంగా ‘లక్కీ భాస్కర్’ సీక్వెల్‌పై ఆసక్తికర చర్చ జరిగింది. త్వరలోనే ఈ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్‌ను తీసుకువస్తానని వెంకీ అట్లూరి ప్రకటించగా.. ఈ ప్రాజెక్ట్ కోసం తాను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నానని, సీక్వెల్ అనౌన్స్మెంట్ పట్ల తాను ఫుల్ ఎగ్జైటెడ్‌గా ఉన్నానని దుల్కర్ సల్మాన్ తెలిపారు.
మొదటి భాగంలో సాధారణ బ్యాంక్ క్యాషియర్‌గా జీవనం సాగిస్తూ, ఆర్థిక ఇబ్బందుల నుంచి అంచలంచెలుగా అక్రమ మార్గాల్లో కోట్లకు పడగెత్తిన భాస్కర్ ప్రయాణం ప్రేక్షకులను కట్టిపడేసింది. 1980-90ల నాటి నేపథ్యం ఈ సినిమాను నిలబెట్టాయి. ఇప్పుడు రాబోయే ‘లక్కీ భాస్కర్ 2’ మరింత హై-వోల్టేజ్ క్రైమ్ డ్రామాతో పాటు సరికొత్త ఆర్థిక కుంభకోణాలు, మోసాల నేపథ్యంలో సాగుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొదటి భాగం సాధించిన ఘన విజయం కారణంగా, సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
And it’s OFFICIAL now..!!! #LuckyBaskhar2 is on the cards…
This time, on a much bigger and grander scale.Confirmed by #DulquerSalmaan and Director #VenkyAtluri. https://t.co/qpTjdAS9us pic.twitter.com/BFoE8rQ7vC
— Rangasthalam (@RangasthalamIN) September 2, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

