త్రిసూర్: మలయాళం నటుడు, రాజ్యసభ మాజీ ఎంపీ సురేశ్ గోపి(Suresh Gopi) కూతురు భాగ్య పెళ్లి ఈ నెల 17వ తేదీన జరగనున్నది. ఆ వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) హాజరుకానున్నారు. గురువయూర్ ఆలయంలో ఆ పెళ్లి జరగనున్నది. ఆ రోజు ఉదయం 8 గంటలకు గుడిలో దైవ దర్శనం తర్వాత ప్రధాని మోదీ అక్కడే జరగనున్న వివాహా వేడుకలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన మళ్లీ కొచ్చి చేరుకుంటారు. ఇప్పటికే ఆలయం వద్ద సెక్యూర్టీ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఆ రోజున పెళ్లికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమిత్ షా రాకపై కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సెక్యూర్టీ ఏర్పాట్లు జరగనున్నట్లు అధికారులు చెప్పారు. త్రిసూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా నటుడు సురేశ్ గోపి ఈసారి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సురేశ్ గోపి కూతురు భాగ్య.. వ్యాపారవేత్త శ్రేయాస్ మోహన్‌ను గురువాయూర్ ఆలయంలో పెళ్లి చేసుకోనున్నది. జనవరి 20వ తేదీన తిరువనంతపురం గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో రిసెప్షన్ జరుగుతుంది.