Pindam Movie | కోలీవుడ్ నటుడు శ్రీరామ్ (Sriram), ఖుషి రవి (Kushi Ravi) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘పిండం’(Pindam). ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. సాయికిరణ్ దైదా (Sai Kiran Daida) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. ఇక థియేటర్ ప్రేక్షకులను భయపెట్టిన ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్‌ను భయపెట్టేందుకు సిద్దమవుతుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుందిది.
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వేదికగా పిండం సినిమా పిబ్రవరి 02 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ”మరణం తర్వాత మళ్లీ జననం! కానీ ఏ రూపంలో, ఏ లోకంలో? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం మరో మూడు రోజుల్లో” అంటూ రాసుకోచ్చింది. కళాహి మీడియా పతాకం (Kalahi Media Banner)పై యశ్వంత్ దగ్గుమాటి (Yashwanth Daggumaati) ఈ సినిమాను నిర్మించారు. శ్రీరామ్‌తో పాటు, ఈశ్వరీరావు, రవివర్మ, మాణిక్ రెడ్డి, బేబీ చైత్ర, బేబీ ఈషా, విజయలక్ష్మి, శ్రీలత తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
మరణం తర్వాత మళ్లీ జననం!
కానీ ఏ రూపంలో, ఏ లోకంలో?
ప్రశ్నలన్నింటికి సమాధానం మరో మూడు రోజుల్లో#Pindam Premieres February 2. @saikirandaida @Yeshwan71014110 @EswariRao @kusheeravi @sri_avasarala @penmatchazoomin #theScariestFilmever pic.twitter.com/Miva4B3vST— ahavideoin (@ahavideoIN) January 30, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ మారుమూల పల్లెటురిలో చాలా రోజులుగా ఎవరూ నివసించని ఒక ఇంట్లోకి హీరో శ్రీరామ్ తన కుటుంబంతో వస్తాడు. అయితే ఆ ఇంట్లో అడుగుపెట్టిన అనంతరం వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. ఇంట్లో ఉన్న ఆత్మ.. శ్రీరామ్ కుటుంబానికి నిద్ర లేకుండా, ప్రాణ భయంతో వణికిపోయేలా చేస్తుంది. అలాంటి సమయంలో వారికి సాయం చేయడానికి మంత్రగత్తె ఈశ్వరీ రావు వస్తుంది. అయితే ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? ఆ ఆత్మల కథ ఏంటి? వాటి నుంచి శ్రీరామ్ కుటుంబాన్ని ఈశ్వరీ రావు రక్షించిందా? అనేది తెలియాలంటే ‘పిండం’ సినిమా చూడాల్సిందే.