Pindam Movie | ఒకరికి ఒకరు (Okariki Okaru) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రముఖ నటుడు శ్రీరామ్ (Sriram). ఇక అయన చాలా రోజుల గ్యాప్ తరువాత నటిస్తున్న తాజా చిత్రం ‘పిండం’(Pindam). కుశీ రవి (Kushi Ravi) హీరోయిన్గా నటిస్తుండగా.. సాయికిరణ్ దైదా (Sai Kiran Daida) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సాయికిరణ్‌కు ఇదే మొదటి మూవీ. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
ఇది అన్ని కుక్కల్లా లేదు. ఇదేదో వేరే జంతువులా ఉంది. దీనిని వెంటనే పూడ్చి పెట్టండి. లేదంటే ఈ ఊరికే ప్రమాదం అంటూ నటి ఈశ్వరీ రావు చెప్పే సంభాషణతో టీజర్ మొదలవుతుంది. టీజర్ గమనిస్తే.. ఓ మారుమూల పల్లెటురిలో ఇల్లు, అందులో ఓ కుటుంబం, వాళ్లను భయపెట్టే ఆత్మ.. దీని చుట్టే కథ స్టోరీ ఉండనున్నట్లు తెలుస్తుంది. ఓ పాప బల్లపై పడుకొని ఉండటం, చుట్టూ నిల్చొని ఉన్న వ్యక్తులు ఏదో ప్రమాదాన్ని శంకిస్తున్నట్లు కనిపించడం టీజర్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఇక ఈ సినిమాలో ఆత్మలను బంధించే మంత్రగత్తె పాత్రలో ఈశ్వరి రావు నటిస్తుండగా.. తన కుటుంబాన్ని ఆత్మ నుంచి రక్షించుకునే పాత్రలో శ్రీరామ్ కనిపించనున్నాడు. ఇక 1930 నుంచి 1990 వరకు మూడు టైమ్లైన్లలో ఈ సినిమా ఉండబోతున్నట్లు దర్శకుడు సాయికిరణ్ దైదా తెలిపాడు.
Experience the Calm before the Storm!!
Presenting you the official teaser of “ #Pindam ”- The Scariest Film Ever.
Link- https://t.co/3JlUZocfdv@Yeshwan71014110@saikirandaida@kalaahi_media@eswari_rao1225#pindam #kalaahimedia #thescariestfilmever #teaserlaunch pic.twitter.com/UKIFnSxzb4
— Vamsi Kaka (@vamsikaka) October 30, 2023
కళాహి మీడియా పతాకం (Kalahi Media Banner)పై యశ్వంత్ దగ్గుమాటి (Yashwanth Daggumaati) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. నవంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి తెలిపారు. శ్రీరామ్‌తో పాటు, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.