Pindam Movie | ఒకరికి ఒకరు (Okariki Okaru) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రముఖ నటుడు శ్రీరామ్ (Sriram). ఇక అయన చాలా రోజుల గ్యాప్ తరువాత నటిస్తున్న తాజా చిత్రం ‘పిండం’(Pindam). కుశీ రవి (Kushi Ravi) హీరోయిన్గా నటిస్తుండగా.. సాయికిరణ్ దైదా (Sai Kiran Daida) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సాయికిరణ్‌కు ఇదే మొదటి మూవీ. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ మోషన్ పోస్టర్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే.. ఈ మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌ను టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు (Sree Vishnu) ఆవిష్కరించారు. అనంతరం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫస్ట్ లుక్ చూస్తే.. అందరూ పైకి చూస్తుండగా.. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఇక 1930 నుంచి 1990 వరకు మూడు టైమ్లైన్లలో ఈ సినిమా ఉండబోతున్నట్లు దర్శకుడు సాయికిరణ్ దైదా తెలిపాడు.
The wait is over! Unveiling the first look of ‘Pindam’ with Sree Vishnu Garu
Get ready for a rollercoaster of Scary and thrilling experience!#Pindam FirstLook #SreeVishnu #ComingSoonA @KalaahiMedia Production No 1https://t.co/l6otgzhP1v
@yeshwanthdaggumati@saikirandaida… pic.twitter.com/PFyRwEhuWv
— BA Raju’s Team (@baraju_SuperHit) October 19, 2023
సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, టీజర్‌ను అక్టోబర్ 30న విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను నవంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి తెలిపారు. శ్రీరామ్‌తో పాటు, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.