Pindam Movie | కోలీవుడ్ నటుడు శ్రీరామ్ (Sriram), ఖుషి రవి (Kushi Ravi) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘పిండం’(Pindam). ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. సాయికిరణ్ దైదా (Sai Kiran Daida) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇక సాయికిరణ్‌కు ఇదే మొదటి మూవీ. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్‌గా నిలిచింది. అయితే తాజాగా ఈ చిత్రంకు సంబంధించి ఓటీటీ అనౌన్స్మెంట్ వచ్చింది.
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వేదికగా పిండం సినిమా త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కళాహి మీడియా పతాకం (Kalahi Media Banner)పై యశ్వంత్ దగ్గుమాటి (Yashwanth Daggumaati) ఈ సినిమాను నిర్మించారు. శ్రీరామ్‌తో పాటు, ఈశ్వరీరావు, రవివర్మ, మాణిక్ రెడ్డి, బేబీ చైత్ర, బేబీ ఈషా, విజయలక్ష్మి, శ్రీలత తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
Keep guessing👻🐦⬛
Coming soon on aha… pic.twitter.com/rDg57y7NUn— ahavideoin (@ahavideoIN) January 25, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ మారుమూల పల్లెటురిలో చాలా రోజులుగా ఎవరూ నివసించని ఒక ఇంట్లోకి హీరో శ్రీరామ్ తన కుటుంబంతో వస్తాడు. అయితే ఆ ఇంట్లో అడుగుపెట్టిన అనంతరం వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. ఇంట్లో ఉన్న ఆత్మ.. శ్రీరామ్ కుటుంబానికి నిద్ర లేకుండా, ప్రాణ భయంతో వణికిపోయేలా చేస్తుంది. అలాంటి సమయంలో వారికి సాయం చేయడానికి మంత్రగత్తె ఈశ్వరీ రావు వస్తుంది. అయితే ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? ఆ ఆత్మల కథ ఏంటి? వాటి నుంచి శ్రీరామ్ కుటుంబాన్ని ఈశ్వరీ రావు రక్షించిందా? అనేది తెలియాలంటే ‘పిండం’ సినిమా చూడాల్సిందే.