ఇటీవల నిర్వహించిన ‘సినిమాటికా ఎక్స్పో’ రెండో ఎడిషన్‌కు అద్భుతమైన స్పందన లభించిందని, ఫిల్మ్ మేకింగ్‌కు సంబంధించిన అధునాతన సాంకేతికాంశాలను పరిచయం చేసిన గొప్ప వేదిక ఇదని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీజీ విందా చెప్పారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘నేను నిత్య విద్యార్థిని. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. విదేశాల్లో కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ ఎక్స్‌పోలు, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తుంటారు.
మన దేశంలో సినీ పరిశ్రమ కోసం ఆ స్థాయి ఎక్స్‌పోలు లేవు. సినిమాటికా ఎక్స్పో అందుకు బీజం పడేలా చేసింది’ అన్నారు. సినిమా ఎక్స్పో వల్ల వరల్డ్‌వైడ్‌గా రాబోతున్న ఎక్విప్మెంట్ గురించి ముందే తెలుస్తుందని, దాంతో సాంకేతికంగా గొప్ప సినిమాలు తీయొచ్చని పీజీ విందా తెలిపారు. సినిమాటికా ఎక్స్పో రెండో ఎడిషన్‌కు 38వేల మంది హాజరయ్యారని, ఆసియాలోనే ఇదొక రికార్డని, ఇదే స్ఫూర్తితో మూడో ఎడిషన్‌ను మరింత వైభవంగా నిర్వహిస్తామని పీజీ విందా పేర్కొన్నారు.