ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘దేవర’ చిత్రం ఈ నెల 27 ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా స్పెషల్షోస్ ప్రదర్శనతో పాటు టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. తొలి రోజు అర్ధరాత్రి 1గంటకు స్పెషల్షోతో పాటు అన్ని థియేటర్లలో ఉదయం 4 గంటల నుంచి ఆరుషోలు ప్రదర్శించుకునేందుకు అనుమతినిచ్చింది. ఇక స్పెషల్షోస్కు టికెట్ ధరను వంద రూపాయలు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ 25, మల్టీఫ్లెక్స్‌ల్లో రూ 50 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది.