శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే టైటిల్ తో రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాతో రాఘవేంద్రరావు నటుడిగా పరిచయం కాబోతున్నారు. వశిష్ఠ పాత్రలో ఆయన సందడి చేయనున్నారు.
పెళ్లి సందడి చిత్ర ట్రైలర్ ని తాజాగా మహేష్ బాబు విడుదల చేశారు. రాఘవేంద్రరావు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ చిత్ర ట్రైలర్ ని లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ అని మహేష్ తెలిపారు. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
పెళ్లి సందడి’ సినిమాకి పనిచేసిన కీరవాణి – చంద్రబోస్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషం. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, పోసాని కృష్మ మురళి, వెన్నెల కిషోర్ రాజీవ్ కనకాల అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. గౌరీ రోణంకి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.
Extremely happy to launch the trailer of @Ragavendraraoba garu's silver screen debut #PelliSandaD!! Wishing him and the entire team all the very best for its release!https://t.co/KtGLmdbnI4@mmkeeravaani #Roshann #SreeLeela #GowriRonanki @Shobu_
— Mahesh Babu (@urstrulyMahesh) September 22, 2021