కొన్ని సినిమాలకు అలా లక్ కలిసొస్తుంది అంతే..! డిజాస్టర్ టాక్‌తో ఓపెన్ అయిన తర్వాత సేఫ్ అవ్వడమే గొప్ప అనుకుంటే.. దానికి భారీ లాభాలు రావడం అనేది అద్భుతం. అలాంటి మిరాకిల్ ఇప్పుడు పెళ్లి సందడి (Pelli SandaD) సినిమా విషయంలో జరిగింది. థియేటర్స్ లో విడుదలైన 30 రోజుల్లోపే ఒరిజినల్ ప్రింట్ విడుదల చేస్తున్నారు. ఈ రోజుల్లో ప్రతి సినిమాకు మంచి రేటు ఇచ్చి ఓటిటి సంస్థలు ఆయా సినిమాలను సొంతం చేసుకుంటున్నాయి. వీలైనంత త్వరగా వాటిని ప్రీమియర్ చేస్తున్నాయి.
ఎంత పెద్ద సినిమా అయినా కూడా 50 రోజుల తర్వాత కచ్చితంగా ఒరిజినల్ ప్రింట్ విడుదల కావాల్సిందే. అల్లు అర్జున్ పుష్ప, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లాంటి సినిమాలు విడుదలైన నాలుగు వారాల లోపే ఓటిటిలోకి వచ్చేశాయి. మరోవైపు ఆఖండ, ఉప్పెన అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా 50 రోజుల తర్వాత ఒరిజినల్ ప్రింట్ విడుదలయ్యాయి. కానీ పెళ్లి సందD మాత్రం ఇంకా OTTలో విడుదల కాలేదు.
శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక (Roshan Meka) హీరోగా రాఘవేంద్రరావు (K Raghavendra Rao) దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోణం (Gowri Ronanki)కి తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. నెగెటివ్ టాక్ వచ్చినా కూడా 2021 దసరా పండగ సీజన్ ను బాగా క్యాష్ చేసుకోవడమే కాకుండా.. బయ్యర్లకు మంచి లాభాలు కూడా తీసుకొచ్చింది పెళ్లి సందD. మరీ ముఖ్యంగా పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఈ సినిమాకు పోటీగా విడుదలైన శర్వానంద్ మహా సముద్రం డిజాస్టర్ కావడం పెళ్లి సందD సినిమాకు బాగా కలిసి వచ్చింది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాగానే ఆడినా దాంతో పాటు రోషన్ సినిమా కూడా మంచి కలెక్షన్స్ తీసుకొచ్చింది. అయితే ఇన్ని రోజుల తర్వాత జీ 5 వాళ్లు ఏకంగా 7 కోట్లు ఇచ్చి ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నారు. సినిమాకు అయిన బడ్జెట్‌కు ఇప్పటికే నిర్మాతలకు భారీ లాభాలు వచ్చాయి. ఇప్పుడు అదనంగా మరో 5 కోట్లకు పైగానే లాభాలు వచ్చాయి. అదిరిపోయే పాటలు ఉండటం..ఫ్యామిలీ సినిమా కావడంతో కచ్చితంగా పెళ్లి సందD టీవీతో పాటు ఓటిటిలోనూ మాయ చేయడం ఖాయం అని నమ్ముతున్నారు వాళ్లు. జూన్ 24 నుంచి జీ5లో పెళ్లి సందడి ప్రసారం కానుంది.