Peddi | మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ అప్డేట్ వచ్చేసింది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ చివరకు విడుదల తేదీని ఖరారు చేసుకుంది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ పాన్ ఇండియా చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో ఘనంగా విడుదల కానుంది.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో మేకర్స్ కూడా విడుదలను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. అక్కడ వరల్డ్ ఫస్ట్ షో భారత కాలమానం ప్రకారం జూన్ 3 రాత్రి 9 గంటలకు ప్రదర్శించనున్నారు. దీనితో విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు ముందుగానే ఈ సినిమా ఎంజాయ్ చేసే అవకాశం పొందుతున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మే 7 నుంచి ప్రారంభం కానున్నాయి. రామ్ చరణ్‌కు ఉన్న గ్లోబల్ క్రేజ్ దృష్ట్యా ప్రీమియర్ షోలకే భారీగా టికెట్లు అమ్ముడవుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా యూఎస్ మార్కెట్లో ఈ చిత్రం రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం పెద్ది ట్రైలర్ ఈ మే 17 లేదా 18న రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇక మూవీ ప్రమోషన్స్ వేగం పెంచుతారు. మధ్య మధ్యలో మూవీకి సంబంధించిన పాటలు, గ్లింప్స్ వదులుతూ సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా ప్లాన్ చేస్తున్నారు.
పెద్ది సినిమాకి వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తుండగా పాన్ ఇండియా లెవెల్లో చాలా గ్రాండ్ రిలీజ్ ని ఈ సినిమాకి ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. అలాగే శివ రాజ్‌కుమార్, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ, జగపతి బాబు వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ స్టార్ కాస్టింగ్ సినిమాపై మరింత హైప్‌ను పెంచుతోంది.మరో ముఖ్య ఆకర్షణగా నిలిచేది సంగీతం. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఆయన మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేకమైన హైలైట్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో భావోద్వేగాలు, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ కలగలిపి రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందా అనే ఆసక్తి అందరిలో ఉంది.