Peddi | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ అవైటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘పెద్ది’ టీమ్ శ్రీలంకలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ – జాన్వీ కపూర్‌లపై లవ్ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. వారం రోజులపాటు జరిగే ఈ షెడ్యూల్‌తో పాటకు సంబంధించిన షూట్ పూర్తవుతుందని తెలుస్తోంది. అయితే ఈ పాట కోసం జాన్వీ కపూర్, రామ్ చరణ్ ప్రత్యేక ఫ్లైట్‌లో శ్రీలంకలో ల్యాండ్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో జాన్వీ కపూర్ వైట్ అండ్ వైట్‌లో కనిపించి సందడి చేశారు.
ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే మూవీ నుండి విడుదలైన గ్లింప్స్‌లో చరణ్ లుక్, సిగ్నేచర్ షాట్ ఫ్యాన్స్‌కి గూస్బంప్స్ తెప్పించగా, ఆ తర్వాత సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే ఫస్ట్ సింగిల్‌పై ఆసక్తికరమైన వార్త వైరల్‌గా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఫస్ట్ సింగిల్ నవంబర్ 8న రిలీజ్ కానుంది. హైదరాబాద్‌లో జరగనున్న ఏఆర్ రెహమాన్ స్పెషల్ ఈవెంట్లో ఈ పాటను విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ ఈవెంట్ ప్రోమోలో ‘పెద్ది’ టైటిల్ ఫాంట్ కనిపించడం ఈ రూమర్లకు మరింత బలం చేకూరుస్తోంది. “ఈ సినిమాలో చరణ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తారు. ఇప్పటివరకూ సిల్వర్ స్క్రీన్‌పై చూడని చరణ్‌ను ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఇమోషనల్ ఎలిమెంట్స్ కలబోసిన కథ ఇది అని తెలిపారు మేకర్స్
ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.గ్లింప్స్ లో వినిపించిన బీజీఎం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెహమాన్ మ్యూజిక్‌తో పాటు చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘పెద్ది’లో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, ‘మీర్జాపూర్’ ఫేం దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ వెంకట కిలారు నిర్మిస్తున్నారు. ‘పెద్ది’ను రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా పాన్-ఇండియా స్థాయిలో – తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.
Chiranjeevi – Sri Devi In One Frame 🔥🤩 Our Next Melody Love Frame Swagger @AlwaysRamCharan & #JahnviKapoor Snapped at Colombo Airport 🔥🤩
Justnow Our Peddi Actress #JahnviKapoor Landed In Colombo Srilanka to Join the Schedule Of #Peddi 🔥 pic.twitter.com/98FPtYSgZ8
— 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) October 30, 2025