Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు లభించడంతో ఇప్పుడు చరణ్ తీసే సినిమాలన్నింటిని పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేస్తున్నారు. ఆ మధ్యలో వచ్చిన గేమ్ ఛేంజర్ ఆశించినంత వర్క్ అవుట్ కాకపోయినా, చరణ్ మాత్రం వెనకడుగు వేసే పరిస్థితిలో లేడు. ప్రస్తుతం ఆయన పెద్ది అనే మాస్ అండ్ మోటివేషనల్ మూవీపై ఫోకస్ పెట్టారు. ‘ఉప్పెన’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన బుచ్చిబాబు సాన డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. కథకు ప్రధానమైన సన్నివేశాలు విజయనగరం నేపథ్యంలో చిత్రీకరించాల్సి ఉంది.
అయితే అక్కడి వాతావరణం షూటింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో, ఆ సీన్లను హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సెట్ వేసి తీయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఈ సెట్ కోసం ఏకంగా రూ. 5 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా రూరల్ స్పోర్ట్స్ డ్రామా కాగా, ఇందులో రామ్ చరణ్ ఒక క్రికెటర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన చిన్న గ్లింప్స్‌కి అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. కథ, లుక్ విభిన్నంగా ఉండనుందని తెలుస్తుంది. వచ్చే ఏడాదిలో ఈ మూవీ రిలీజ్ కానుంది. చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ రెడీ అయ్యాయని సమాచారం.
మాస్ నేపథ్యంలో సాగే కథకు రెహమాన్ ఇచ్చే మ్యూజిక్ ఎంతగా ఎలివేట్ చేస్తుందో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె, వెంటనే రామ్ చరణ్ సరసన ఛాన్స్ కొట్టేసింది. ఇక ‘పెద్ది’ కోసం రామ్ చరణ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు.. ఇటీవల ఆయన జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ లుక్ చూస్తే సినిమాపై ఆయనకు ఎంత డెడికేషన్ ఉందో స్పష్టంగా తెలుస్తోంది. రఫ్ అండ్ రగ్డ్ లుక్ కోసం చరణ్ తీసుకుంటున్న శ్రమను చూసి అభిమానులు పొగడ్తలతో ముంచేస్తున్నారు.