Global Star Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్లో భారీ పోరాట సన్నివేశాలతో పాటు, చిత్రంలోని ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. తాజాగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సెట్స్ నుంచి కొత్త ఫొటోను పంచుకుంది టీమ్. ఇందులో దర్శకుడు బుచ్చిబాబు సానాతో పాటు రామ్ చరణ్, బాలీవుడ్ నటుడు దివ్యేండు శర్మ కలిసి ఉన్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 27న విడుదల కానుంది.
బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ, కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్షన్, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందు భట్టాచార్య వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
#Peddi shoot going on at a brisk pace in a gigantic set in Hyderabad ❤️🔥
A massive fight sequence and some crucial scenes will be shot in this schedule with all the key cast.
Wishing you all a very Happy Hanuman Jayanthi ✨#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026 💥💥
Global… pic.twitter.com/4JyNS7W3DQ
— Vriddhi Cinemas (@vriddhicinemas) May 22, 2025