Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘పెద్ది’ (Peddi) పై అంచనాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పూర్తిస్థాయి మాస్ అవతారంలో కనిపించనున్నాడనే వార్తలు అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ను క్రియేట్ చేశాయి. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్, పోస్టర్లు సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న వరల్డ్‌వైడ్ రిలీజ్ చేస్తామని గతంలో చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆ తేదీని దృష్టిలో పెట్టుకుని అభిమానులు క్యాలెండర్లో టిక్ కూడా పెట్టేసుకున్నారు. అయితే, తాజా పరిస్థితులను చూస్తే ఆ డేట్‌కి సినిమా థియేటర్లకు రావడం కష్టమేనన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. కీలకమైన షెడ్యూల్స్ మిగిలి ఉండటంతో పాటు, భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎక్కువ సమయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కలర్ గ్రేడింగ్ వంటి అంశాలపై మేకర్స్ ఎలాంటి రాజీ పడకుండా పర్ఫెక్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట.ఇదిలా ఉండగా, తెలంగాణలో టికెట్ రేట్లకు సంబంధించిన పరిస్థితులు కూడా ‘పెద్ది’ రిలీజ్ ఆలస్యానికి ఒక కారణంగా మారొచ్చని చిత్ర వర్గాల సమాచారం. పెద్ద బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాకు సరైన థియేట్రికల్ రెవెన్యూ రావాలంటే అనుకూలమైన మార్కెట్ పరిస్థితులు అవసరం. అందుకే హడావుడిగా కాకుండా, అన్ని అంశాలు సెట్ అయిన తర్వాతే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో మరో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. తాజా బజ్ ప్రకారం, ‘పెద్ది’ చిత్రాన్ని 2026 దసరా పండుగకు విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. వేసవి సీజన్లో రిలీజ్ చేయాలనే ఆప్షన్ ఉన్నప్పటికీ, దసరా ఫెస్టివల్ టైమ్ అయితే మాస్ సినిమాలకు కలిసొచ్చే పీరియడ్ కావడంతో అదే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోందట. దసరా సీజన్ అంటే థియేటర్లలో పండుగ వాతావరణం, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ప్రేక్షకుల సందడి అన్ని కలిసొచ్చే సమయం. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో మాస్ అవతారంలో వస్తున్న సినిమాకు ఈ టైమ్ గోల్డెన్ పీరియడ్ అవుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.