Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. యువ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేయగా, అక్కడ అభిమానుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన లభిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘పెద్ది’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన అరగంటలోనే 50 వేల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసినట్లు సమాచారం. ఈ వేగం చూస్తుంటే సినిమా ఓవర్సీస్ మార్కెట్లో భారీ ఓపెనింగ్స్ నమోదు చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటికే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తెలుగు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన కనిపిస్తోందట. ముఖ్యంగా రామ్ చరణ్‌కు ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత గ్లోబల్ స్థాయిలో ఏర్పడిన క్రేజ్ ‘పెద్ది’ బుకింగ్స్‌పై స్పష్టంగా కనిపిస్తోందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ‘ఉప్పెన’తో దర్శకుడిగా సంచలనం సృష్టించిన బుచ్చిబాబు సానా, ఇప్పుడు రామ్ చరణ్‌తో కలిసి చేస్తున్న ‘పెద్ది’ సినిమాను చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. గ్రామీణ నేపథ్యంతో కూడిన మాస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారని ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ ద్వారా స్పష్టమైంది. మాస్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా కథను రూపొందించినట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. రామ్ చరణ్‌తో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉంటుందన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇదే ఆమెకు మరో భారీ తెలుగు ప్రాజెక్ట్ కావడంతో బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా సినిమాపై బజ్ పెరిగింది.ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకోగా, సినిమాలో సంగీతం మరో హైలైట్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. వృద్ధి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా భాషల్లో విడుదల కానుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా పైడ్ ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేయడం విశేషం. ప్రస్తుతం ఓవర్సీస్ బుకింగ్స్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే, ‘పెద్ది’ విడుదల రోజునే భారీ రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఫైనల్ ప్రీ-సేల్స్, ప్రీమియర్ షో కలెక్షన్స్ ఎక్కడివరకు వెళ్తాయో అన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.