అగ్ర నటుడు చిరంజీవితో బుధవారం తెలంగాణ ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. జూన్ 4న విడుదలకానున్న ‘పెద్ది’ చిత్రాన్ని రెంటల్ విధానంలోనే ప్రదర్శించాలని నిర్ణయించారు. జూన్ 30 తర్వాత విడుదలయ్యే చిత్రాలకు పర్సంటేజీ విధానాన్ని వర్తింపజేస్తామని ఎగ్జిబిటర్లు తెలిపారు. ఒకవేళ టికెట్ రేట్లు పెంచితే రెంట్తో పాటు 7.5శాతం ఎగ్జిబిటర్లకు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
పర్సంటేజీ విధానం అమలు కోసం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వేసిన కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం నడచుకోవాలని ఎగ్జిబిటర్లకు చిరంజీవి సూచించారు. చిరంజీవితో చర్చలు సానుకూలంగా జరిగాయని, జూన్ 30లోగా పర్సంటేజీ విధానం అమలు అయ్యేలా ప్రయత్నం చేస్తానని చిరంజీవి తమకు హామీ ఇచ్చారని తెలంగాణ ఎగ్జిబిటర్లు ఓ ప్రకటనలో తెలిపారు.