అగ్రహీరో రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్న పానిండియా ప్రాజెక్ట్‌కు ‘పెద్ది’ అనే పేరు ఖరారు చేశారు. గురువారం రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. మ్యాసీ హెయిర్ ైస్టెల్‌తో.. రగ్గ్డ్ గడ్డంతో, ముక్కుకు రింగుతో సిగార్ వెలిగిస్తూ.. ఫెరోషియస్‌గా ఓ లుక్‌లో రామ్‌చరణ్ కనిపిస్తుంటే.. ఫ్లడ్ లైట్లతో ప్రకాశిస్తున్న స్టేడియం బ్యాక్‌డ్రాప్‌లో క్రికెట్ బ్యాట్ పట్టుకుని సీరియస్‌గా చూస్తూ.. మరో లుక్‌లో రామ్‌చరణ్ దర్శనిస్తున్నారు.
రామ్‌చరణ్ పాత్రలోని పవర్‌ని ఎస్టాబ్లిష్ చేసేలా ‘పెద్ది’ అనే టైటిల్‌ని దర్శకుడు బుచ్చిబాబు సానా నిర్ణయించారని, భారీ బడ్జెట్‌తో అత్యాధునిక సాంకేతికత, అత్యద్భుతమైన విజువల్స్‌తో, ప్రపంచస్థాయి నిర్మాణ విలువలతో ఓ ఎపిక్‌గా ఈ సినిమా రూపొందుతున్నదని, ప్రేక్షకులకు మరపురాని అనుభవం ఇచ్చే సినిమా ఇదని నిర్మాతలు తెలిపారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ అగ్రహీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందు శర్మ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, నిర్మాత: వెంకట సతీష్ కిలారు.