రామ్‌చరణ్ ‘పెద్ది’ చిత్రాన్ని గ్రామీణ క్రీడా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ కథలోని రా అండ్ రస్టిక్ బ్యాక్‌గ్రౌండ్, పల్లెటూరి మూలాలను, వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ హైదరాబాద్‌లో భారీ విలేజ్ సెట్‌ను తీర్చిదిద్దారు. కళా దర్శకుడు అవినాష్ కొల్లా తీర్చిదిద్దిన ఈ సెట్లో ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు కొంత టాకీ పార్ట్‌ను చిత్రీకరించబోతున్నారు. గురువారం ఈ అప్డేట్ను పంచుకున్న మేకర్స్ ఆన్ లొకేషన్ స్టిల్స్‌ను విడుదల చేశారు. ఇందులో రామ్‌చరణ్ బాగా పెరిగిన జుట్టు, గడ్డంతో సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తున్నారు.
ఆయన పాత్ర తాలూకు వైవిధ్యం లుక్‌లో కనిపిస్తున్నది. ఇప్పటికే 30 శాతం చిత్రీకరణ పూర్తయిందని, తాజా షెడ్యూల్లో ప్రధాన భాగానికి సంబంధించిన షూటింగ్ పూర్తవుతుందని మేకర్స్ పేర్కొన్నారు. క్రికెట్, కుస్తీ పోటీల నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. జాన్వీకపూర్, శివరాజ్‌కుమార్, జగపతిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్, రచన-దర్శకత్వం : బుచ్చిబాబు సానా.