Peddi | రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం పెద్ది. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మూవీకి సంబంధించిన అప్డేట్స్ మెగా ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం క్రేజీ ట్యూన్స్‌ను సిద్ధం చేస్తుండగా, ఇవి మూవీపై అంచనాలు భారీగా పెంచుతున్నాయి. లెజెండరీ మ్యూజీషియన్ ఏఆర్ రెహమాన్ అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేస్తున్నారట. ఈ క్రమంలో పెద్ది పై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. దర్శకుడు బుచ్చి బాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఒక పవర్ఫుల్ స్పోర్ట్స్ డ్రామా గా రూపొందుతోంది. మేకింగ్ పరంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమా నిర్మాణాన్ని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.ఈ రోజు (ఆగస్ట్ 27) వినాయక చవితి సందర్భంగా మూవీ యూనిట్ నుండి ఓ భారీ అప్డేట్ వెలువడింది. సినిమాలోని ఓ మాస్ బీట్ సాంగ్‌కి సంబంధించిన షూటింగ్ నేడు ప్రారంభమైందని ప్రకటించారు. ఈ పాటకు సంగీతం అందించింది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్. సమాచారం ప్రకారం, ఇది సినిమాలో ఓ హైలైట్ మాస్స్ నెంబర్‌గా నిలవనుందని టాక్.
ఈ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పాట కోసం 1000 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారు. ఈ గ్రాండ్ సెట్‌ను మైసూర్లో ఏర్పాటు చేశారు. దీంతో ఈ సాంగ్ విజువల్స్ స్క్రీన్ మీద విపరీతంగా ఆకట్టుకునేలా ఉండబోతున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రామ్ చరణ్ – బుచ్చి బాబు కాంబో, రెహమాన్ మ్యూజిక్, జాన్వీ గ్లామర్, మాస్ బీట్ సాంగ్ తో మైత్రీ సంస్థ ఖాతాలో మరో విజయం చేరండం గ్యారెంటీ అని అంటున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందన్న విషయం కన్ఫార్మ్ అయ్యింది. ఆ పాటలో స్టార్ హీరోయిన్ సమంత, రామ్ చరణ్ సరసన ఆడిపాడితారన్న టాక్ వినిపిస్తోంది.
రహమాన్ గారి డప్పు….
రామ్ చరణ్ గారి స్టెప్పు….
Trust me It’s a
“MEGA POWER ⭐” Blast 💥 @RathnaveluDop Sirrr’s Visual Magic 🙏🙏🙏Song Shoot Begins today..
Happy Vinayaka Chavithi to all 🙏🏼@AlwaysRamCharan @arrahman #Peddi pic.twitter.com/UPKXQGkYbJ— BuchiBabuSana (@BuchiBabuSana) August 27, 2025