Peddi | ‘పెద్ది’పై పెరుగుతున్న అంచనాలు.. ఐటమ్ సాంగ్ రిలీజ్‌కి టైం ఫిక్స్ చేసిన మేకర్స్
Peddi | మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న భారీ చిత్రం పెద్ది ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా చాలా కాలం తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందింది.
Peddi | మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న భారీ చిత్రం పెద్ది ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా చాలా కాలం తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందింది.ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కథ, పాత్రలు, రామ్ చరణ్ లుక్ అన్నీ కూడా సినిమా మీద హైప్ మరింత పెంచుతున్నాయి. ఇటీవల ఈ సినిమాలో ఒక ప్రత్యేక ఐటమ్ సాంగ్‌ను మేకర్స్ చిత్రీకరించినట్లు వార్తలు వినిపించాయి. ఈ సాంగ్‌లో భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్‌తో పాటు మాస్ బీట్ ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ పాట సినిమాకు మరో హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ పాట కోసం ప్రత్యేకంగా భారీ ఖర్చు పెట్టినట్లు కూడా ఇండస్ట్రీ టాక్.అయితే ఈ స్పెషల్ సాంగ్‌ను ఎప్పుడు విడుదల చేస్తారన్నది అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ ముందుగా ట్రైలర్‌ను విడుదల చేసి, ఆ తర్వాతే ఈ ఐటమ్ సాంగ్‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే మే మూడో వారంలో ఈ సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రైలర్‌తో సినిమా మీద ఆసక్తిని పెంచి, తర్వాత సాంగ్‌తో మరింత హైప్ క్రియేట్ చేయాలన్నదే మేకర్స్ స్ట్రాటజీగా తెలుస్తోంది.
ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఏ.ఆర్. రెహమాన్ ట్యూన్స్‌పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఐటమ్ సాంగ్‌కు ఆయన ఎలాంటి బీట్ అందించారో తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెహమాన్ నుంచి మాస్, క్లాస్ మిక్స్‌తో కూడిన ప్రత్యేక ట్యూన్ వస్తుందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ‘పెద్ది’ సినిమా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ట్రైలర్, పాటల విడుదలతో ఈ అంచనాలు మరింత పెరగనున్నాయి. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- buchi babu
- glimpse
- item song
- peddi
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

