Peddi | ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ఈ ఏడాది పెద్దగా ఆకట్టుకోలేని రామ్‌చరణ్ ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాతో మళ్ళీ మాస్‌ను ఉర్రూతలూగించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం చరణ్ ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నారు. ఇది ఒక విలేజ్ స్పోర్ట్స్ రివెంజ్ డ్రామాగా రూపొందుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సతీష్ కిలారు వృద్ది సినిమాస్ బ్యానర్‌పై, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో నిర్మిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
ఇక కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలో వెయ్యి మందికి పైగా డ్యాన్సర్లతో షూట్ చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో తెరకెక్కిన ఈ పాట సినిమాకే హైలైట్ కానుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026, మార్చి 27న వరల్డ్ వైడ్‌గా విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేసింది. కాగా, దసరా పండుగ సందర్భంగా ‘పెద్ది’ నుంచి ఓ మ్యూజికల్ సింగిల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే రామ్‌చరణ్ ఆ పాటను విన్నట్టు, అది అద్భుతంగా ఉందని మెచ్చుకున్నట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా, సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ పనిచేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రామ్‌చరణ్ క్రికెట్ షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కొంతమంది అంతర్జాతీయ క్రికెటర్లు కూడా దానిని రీ-క్రియేట్ చేయడంతో, సినిమా పట్ల ఆసక్తి మరింత పెరిగింది.
మరోవైపు దసరా సీజన్లో మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్టు సమాచారం. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ తరువాత వారి రెండో కాంబో కావడం విశేషం. దీంతో దసరాకి తండ్రి, కొడుకులిద్దరూ మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నట్టు గాసిప్ ఫిలింనగర్లో హాట్ టాపిక్‌గా మారింది. రామ్‌చరణ్ అభిమానులు ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ తరువాత ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. సుకుమార్ శిష్యుడు డైరెక్ట్ చేస్తుండటం, కథలో విలేజ్ బ్యాక్‌డ్రాప్, క్రికెట్, రివెంజ్ అంశాలు ఉండటంతో పాటు, ఏఆర్ రెహమాన్ సంగీతం మేజర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.