Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ‘పెద్ది’ టీమ్ స్పెషల్ ట్రీట్ అందించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ భారీ రూరల్ స్పోర్ట్స్ డ్రామా నుంచి మార్చి 27న సరికొత్త టీజర్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన మొదటి టీజర్లో చరణ్ క్రికెట్ ప్లేయర్‌గా కనిపించి ఆకట్టుకోగా, తాజా టీజర్లో మాత్రం పూర్తిగా భిన్నమైన మాస్ అవతార్‌లో దర్శనమిచ్చాడు. కుస్తీ పోటీలలో పాల్గొనే శక్తివంతమైన యోధుడిగా ఆయన కనిపించిన తీరు అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. భారీ దేహదారుఢ్యం, కఠినమైన చూపులు, రఫ్ లుక్ అన్నీ చరణ్ పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా చూపిస్తున్నాయి.
ఈ టీజర్ ద్వారా సినిమా నేపథ్యం, కథా గురించి కొంత క్లారిటీ వచ్చింది. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో స్థానిక క్రీడలు, ముఖ్యంగా కుస్తీ పోటీలు కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. చరణ్ ఫిజిక్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో ఆమె పాత్ర కూడా ఆసక్తికరంగా ఉండబోతుందని సమాచారం.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ‘పెద్ది’ సినిమా భారీ స్థాయిలో రూపొందుతోంది. కథ, టేకింగ్, మ్యూజిక్, యాక్షన్ అన్ని విభాగాల్లో ఈ చిత్రం కొత్త ప్రమాణాలు సృష్టించే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే టీజర్‌తోనే భారీ బజ్ క్రియేట్ చేసిన ‘పెద్ది’, విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. మొత్తానికి, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ఈ టీజర్ ఆయన అభిమానులకు పర్ఫెక్ట్ గిఫ్ట్‌గా నిలిచింది. చరణ్ మాస్ అవతార్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.