Peddha Kapu Movie | నారప్ప సినిమాతో సెన్సిబుల్ దర్శకుడిగా పేరున్న శ్రీకాంత్ అడ్డాల మాస్ సినిమాలు డీల్ చేయడంలో కూడా దిట్ట అని నిరూపించుకున్నాడు. పేరుకు రీమేక్ సినిమానే అయినా.. ఒరిజినల్ సోల్ మిస్సవ్వకుండా శ్రీకాంత్ తన టేకింగ్‌తో కథను నడిపిన తీరుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ దర్శకుడు ఓ కొత్త నటుడిని హీరోగా పెట్టి పెద కాపు సినిమా చేస్తున్నాడు. ఇది కూడా రా, రస్టిక్‌గా ఉండబోతుంది. టైటిల్ పోస్టర్ నుంచి గ్లింప్స్ వరకు ప్రతీది అంతకంతంకూ అంచనాలు పెంచుతూనే వచ్చాయి. ఈ సినిమాతో మిర్యాల రవిందర్ రెడ్డి మేనల్లుడు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ నెల చివరాఖరున రావాల్సిన సలార్ పోస్ట్ పోన్ అవడంతో సెప్టెంబర్ 29వ డేట్‌ను పెద కాపు బృందం లాక్ చేసుకుంది. ఇక ఇప్పటికే ఆ డేట్ ముందు రోజు కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ రిలీజ్ కాబోతుంది. అదే రోజున రామ్ పోతినేని స్కంద సినిమా కూడా రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుందట. ఒక వేళ స్కంద వస్తే మాత్రం ఈ సినిమాకు గట్టి పోటీ అవుతుంది. ఇప్పటికే రిలీజైన స్కంద టీజర్, ట్రైలర్లు మాస్ ఆడియెన్స్‌లో మాములు ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయలేవు. దీనితో పోటీ అంటే రిస్క్ అనే చెప్పాలి. అయితే ఇంకా స్కంద రిలీజ్ డేట్‌పై ఎలాంటి క్లారిటీ లేదు గనుక ఇప్పటి వరకైతే పెద కాపుకు రిస్క్ లేనట్టే.
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా 1980 బ్యాక్ డ్రాప్లో సాగుతుందని తెలుస్తుంది. ఆ టైమ్‌లో కోనసీమలో రాజకీయాలు, అక్కడ వర్గ పోరాటాలు, కులాల ఆదిపత్యాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని ఇన్సైడ్ టాక్. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాని కాస్త రా కంటెంట్‌తోనే తెరకెక్కించినట్లు తెలుస్తుంది. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవస్తవ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించాడు.