Peddha Kapu-1 Movie | టీజర్, ట్రైలర్లతో పెదకాపు సినిమాపై మాస్ ఆడియెన్స్‌లో ఓ రేంజ్లో అంచనాలు క్రియేట్ అయ్యాడు. దానికి తోడు భారీ లెవల్లో ప్రమోషన్లు గట్రా చేయడంలో రిలీజ్ ముంగిట సినిమా తిరుగులేని హైప్ నెలకొంది. ఎలాగో నారప్పతో యాక్షన్‌ను డీల్ చేసిన అనుభవం ఉంది కాబట్టి.. ఈ సినిమా కూడా ఊహించని రేంజ్లో ఉంటుందని అందరూ అమితాసక్తితో ఎదురు చూశారు. ఇక కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో రెండు రోజుల ముందు పేయిడ్ ప్రీమియర్లు కూడా వేశారు. ఆ ప్రీమియర్లకు ఆహా ఓహో అన్న రేంజ్లో టాక్ రాలేదు కానీ.. డీసెండ్గా ఉందని రివ్యూలు ఇచ్చారు. తీరా రిలీజయ్యాక ఆ డీసెంట్ టాక్ కూడా రాలేదు. కొన్ని మంచి సీన్లు పడ్డాయి కానీ.. ఓవరాల్‌గా చూసుకుంటే చాలా లాగ్ ఉందని, బోర్ కొట్టే అంశాలు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చారు.
దాంతో ఈ సినిమాకు తొలిరోజే మిక్స్డ్ రివ్యూలతో పెద్ద దెబ్బ తగిలింది. దానికి తోడు స్కంద, చంద్రముఖి-2 సినిమాల పోటీని పెదకాపు-1 తట్టుకోలేకపోయింది. మూడు భిన్న సినిమాలే అయినప్పటికీ.. ముఖ పరిచయంలేని హీరో.. పెద్దగా సక్సెస్ రేటు లేని దర్శకుడు కావడంతో పెదకాపు సినిమాపై ఫ్యామిలీ ఆడియెన్స్ అంత సుముఖతగా లేరు. ఆ ప్రభావం కలెక్షన్లపై పెద్ద దెబ్బ పడింది. తొలిరోజు కేవలం రూ.13 లక్షల షేర్ మాత్రమే సాధించి.. డిజాస్టర్ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. రీసెంట్గా రిలీజైన కన్నడ రీమేక్ సప్త సాగరాలు దాటి సినిమా కూడా తొలిరోజు రూ.75 లక్షల రేంజ్లో కలెక్షన్లు సాధించింది. కానీ ఈ సినిమా అందులో పావు వంత కలెక్షన్లు కూడా సాధించకపోవడం గమనార్హం.
ఇక రెండో రోజు కూడా కలెక్షన్లు దాదాపుగా అదే స్థాయిలో వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా పుంజుకోవడం కష్టమే. దాదాపు రూ.13 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రెండు రోజుల్లో పాతిక లక్షల షేర్ కూడా సాధించలేకపోయింది. చూస్తుంటే శ్రీకాంత్ కెరీర్లో మరో అల్ట్రా డిజాస్టర్ సినిమా అయ్యేలా కనిపిస్తుంది. మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో విరాట్ కర్ణ, ప్రగతిలు హీరోయిన్లుగా నటించారు.