ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం మాయా పేటిక (Maya Petika). గత జూన్‌లో టాలీవుడ్ యాక్టర్ రానా దగ్గుబాటి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా.. మంచి స్పందన వస్తోంది. కాగా ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ ఫస్ట్ గ్లింప్స్ వీడియోను రేపు సాయంత్రం 06:30 గంటలకు లాంఛ్ చేయనున్నారు. హైదరాబాద్‌లోని వెస్టిన్ హోటల్ ఈ కార్యక్రమం జరుగనుంది.
థ్యాంక్యూ బ్రదర్ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన రమేశ్ రాపర్థి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణ బాలసుబ్రహ్మణ్యం సంగీతం అందిస్తున్నారు. సుప్రీం పాన్ వరల్డ్ హీరో సర్ప్రైజింగ్ లాంఛింగ్ కోసం సిద్దంగా ఉండండి..ఫస్ట్ గ్లింప్స్ వీడియో వచ్చేస్తుంది అంటూ ఓ వీడియోను రమేశ్ రాపర్థి షేర్ చేశాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఆటో, కారుతోపాటు ఇతర వాహనాల రాకపోకలతో ఉన్న రోడ్డు విజువల్స్ వీడియోలో కనిపిస్తున్నాయి. తాజా వీడియోతో ఫస్ట్ గ్లింప్స్ ఎంత ఆసక్తికరంగా ఉండబోతుందో..? హింట్ ఇస్తున్నాడు డైరెక్టర్. పాయల్ రాజ్‌పుత్ ఎలాంటి స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
ఫస్ట్ గ్లింప్స్ అప్డేట్ వీడియో..