Payal Rajput | ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) లీడ్ రోల్లో నటించిన మూవీ మాయా పేటిక (Maya Petika). రమేశ్ రాపర్థి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది సెప్టెంబర్ 15న పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో ప్రీమియర్ అయింది. చాలా రోజుల తర్వాత మాయా పేటికకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. మాయా పేటిక మరో ప్లాట్‌ఫాంలో కూడా సందడి చేయనుంది.
తాజా అప్డేట్ ప్రకారంమాయా పేటిక ETV Winలో మే 16న ప్రీమియర్ కానుంది. తాజా నిర్ణయంతో మాయా పేటిక మరింత ఎక్కువ మంది వీక్షించే అవకాశం దక్కిందన్నమాట. జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి గుణ బాలసుబ్రణియన్ సంగీతం అందించాడు. మాయాపేటికలో విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, సునీల్, శ్రీనివాస్ రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఫస్ట్ గ్లింప్స్ అప్డేట్ వీడియో..