పంజాబీ భామ పాయల్ రాజ్‌పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ ఈ అమ్మడి కెరీర్‌కి ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పాయల్.. ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకోవడానికి హాట్ హాట్ ఫోటో షూట్లు చేస్తూ ఉంటుంది. అలా ఫోటో షూట్స్ చేసి ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది.
ఇటీవల ఓ ఫోటో షూట్‌కు సంబంధించి బి హైండ్ ది సీన్స్ అంటూ ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో అత్యంత అసభ్యకరంగా ఉండటంతో వెంటనే తేరుకుని డిలీట్ చేసేసింది. అయితే అప్పటికే ఈ వీడియోని కొంత మంది డౌన్ లోడ్ చేసి తెగ వైరల్ చేశారు. దీనిపై స్పందించిన పాయల్ రాజ్ పుత్.. ట్రోలర్స్‌ని నిందిస్తూ, ఇతర మహిళల వద్ద ఉన్నదే తన దగ్గర ఉందని, వారి వద్ద లేనిది తన వద్ద లేదని కూడా చెప్పింది.
ఒక చిన్న సమస్యని టార్గెట్ చేయడం మానుకోవాలని ఆమె ట్రోలర్స్ ను కోరింది. ఆన్లైన్ లో పని లేని వాళ్ళు వీడియోను మార్ఫింగ్ చేసి దానిని వ్యాప్తి చేశారని ఆమె ఆరోపించింది. లోదుస్తులు లేకుండా చేసిన ఫోటో షూట్లో తన అందాలను కోటుతో కాపాడేసుకుంటున్నాను అని పాయల్ అనుకుంది కానీ ఆ కోటును సరిగ్గా పట్టుకోలేకపోయింది. దాంతో ఆమె ఎద అందాలు కనిపించాయి. ఆ వీడియో తెగ వైరల్ కావడంపై పాయల్ అసహనం వ్యక్తం చేసింది.