Payal Ghosh | పద్నాలుగేండ్ల కిందట మంచు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బెంగాలీ భామ పాయల్ ఘోష్. ఆ తర్వాత తారక్ నటించిన ఊసరవెల్లిలో కీలక పాత్ర పోషించింది. ఈ రోల్ పాయల్ ఘోష్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ అవకాశాలు మాత్రం సో సోగానే వచ్చాయి. బాలీవుడ్లో పలు సినిమాలు చేసిన ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక గత కొంత కాలంగా ఈమె సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఈ మధ్య నెట్టింట తెగ సందడి చేస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ చేసిన ట్వీట్ బాలీవుడ్‌నాట సంచలనం రేపుతుంది. బాలీవుడ్లో హీరోయిన్లకు ప్రతిభతో పనిలేదని బట్టలు విప్పితే చాలని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసింది. దేవుడి దయవల్ల సౌత్ సినిమాల ద్వారా పరిచయం అయ్యాను.. కానీ అలా కాకుండా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి ఉంటే నా బట్టలు విప్పించేవారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఇక్కడ అమ్మాయిల క్రియేటివిటీ, టాలెంట్ కంటే శరీరాలను వాడుకుంటారు. వారికదే కావాలి అంటూ ట్వీట్ వేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాను ఊపేస్తుంది.
ఇక తరచూ ఈ భామ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై విమర్శలు చేస్తూ ఉంటుంది. ఈ మధ్య మీటూ ఉద్యమంలో భాగంగా బాలీవుడ్ కంటే ముందు దక్షిణాది చిత్రాల్లో నటించానని.. జాతీయ అవార్డులు పొందిన ఇద్దరు డైరెక్టర్స్‌తో పనిచేశానని పాయల్ ఘోష్ చెప్పింది. అయినప్పటికీ ఆ ఇద్దరూ తనకెంతో గౌరవం ఇచ్చారని.. ఇబ్బంది పెట్టేలాగా ఎప్పుడూ వ్యవహరించలేదని అప్పట్లో చెప్పింది. ఇక బాలీవుడ్ విషయానికొస్తే డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఎప్పుడూ తనపై సామరస్యంగా ప్రవర్తించలేదని.. తనను కలిసిన మూడో మీటింగ్‌లోనే లైంగికంగా దాడి చేశాడని సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్‌గా నిలిచింది.
Thank god, I got launched in South Film Industry, if I would have got launched in #Bollywood they would have removed my clothes to present me, cos they use female bodies more than their creativity 😔
— Payal Ghoshॐ (@iampayalghosh) October 1, 2023