VIshwak Sen-Arjun Movie | యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘మా పల్లెల్లో గోపాలుడు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అర్జున్ ‘జెంటిల్మెన్’, ‘ఒకేఒక్కడు’, ‘ద్రోహీ’, ‘హనుమాన్ జంక్షన్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈయన దాదాపు నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ మెగాఫోన్ పట్టడానికి సిద్దమైయ్యాడు. అది కూడా నేరుగా తెలుగు సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటివరకు ఈయన 12 సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో ‘జై హింద్-2’ మాత్రమే తెలుగులో విడుదలైంది.
ప్రస్తుతం ఈయన టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్‌తో తెలుగులో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంతో అర్జున్ కూతురు ఐశ్వర్యఅర్జున్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే ప్రకటన జరుపుకున్న ఈ చిత్రం గురవారం పూజా కార్యక్రమాలను గ్రాండ్‌గా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ అథితిగా వచ్చి క్లాప్ కొట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.శ్రీరామ్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అర్జున్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
విశ్వక్ ఇటీవలే ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో మంచి విజయాన్ని సాధించి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్‌పై ఉంచాడు. అందులో ఒకటి ‘ఓరి దేవుడా’. తమిళంలో సూపర్ హిట్టయిన ‘ఓమై కడువలే’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఒరిజనల్ వెర్షన్‌ను తెరకెక్కించిన అశ్వత్ మరిముత్తు రీమేక్ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. దీనితో పాటుగా ‘దాస్ కా దమ్కి’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని విశ్వక్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. వీటితో పాటుగా ‘ముఖచిత్రం’ సినిమాలో గెస్ట్ రోల్‌ను పోషిస్తున్నాడు.
Power Star #PawanKalyan graced #VishwakSen – #Arjun film Muhurtham & Pooja Ceremony
Mass Ka Dass @VishwakSenActor, @aishwaryaarjun starrer in @akarjunofficial direction launched today@srfioffl @IamJagguBhai @RaviBasrur #VishwakSen11 pic.twitter.com/HkSEOxmsN4
— Vamsi Kaka (@vamsikaka) June 23, 2022