Toliprema Re-Releasing | టాలీవుడ్ ప్రేమకథల్లో టైమ్ లెస్ క్లాసిక్‌గా చెప్పుకునే సినిమా ‘తొలిప్రేమ’. పాతిక వసంతాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో ఓ మైలు రాయిగా నిలిచిపోయింది. అప్పటికే మూడు బ్యాక్ టు బ్యాక్ హిట్లో మంచి ఫామ్‌లో ఉన్న పవన్‌కు ఈ సినిమా తిరుగులేని స్టార్డమ్ తెచ్చిపెట్టింది. పేరుకు ప్రేమకథే అయినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం మాస్ నంబర్స్ క్రియేట్ చేసింది. ఏ కరుణాకరన్ దర్శకత్వ ప్రతిభను మెచ్చుకోని వారుండరు. హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్, పవన్-కీర్తికు మధ్య వచ్చే సీన్స్, ప్రేక్షకులను ఎమోషనల్ చేసిన క్లైమాక్స్, విజిల్స్ వేయించిన పాటలు, సిస్టర్ సెంటిమెంట్ ఇలా సినిమాలో ప్రతీది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
కాగా పాతికేళ్ల ఈ ఎపిక్ లవ్‌స్టోరీ మళ్లీ థియేటర్లలోకి వస్తుంది. జూన్ 30న ఈ సినిమా 4K ప్రింట్‌తో రీ-రిలీజ్ కానుంది. ఈ న్యూస్‌తో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కమెడియన్ అలీ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో పవన్‌కు జోడీగా కీర్తి రెడ్డి హీరోయిన్గా నటించింది. ఇక అప్పట్లో ఈ సినిమా ముందుగా అక్కినేని సుమంత్ దగ్గరకు వెళ్లిందట. అయితే పలు కారణాల వల్ల సుమంత్ ఈ కథను వద్దనుకున్నాడని సమాచారం. దాంతో కరుణాకరన్ పవన్‌కు ఈ కథ వినిపించాడట. పవన్‌కు కథ నచ్చడంతో ఒక్క సిట్టింగ్‌లోనే ఓకే అయిపోయిందట. ఈ సినిమాతో కరుణాకరన్ పేరు కూడా టాలీవుడ్లో మార్మోగిపోయింది.