అగ్రహీరో పవన్‌కల్యాణ్ రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చేసి తను ముందుగా కమిటైన సినిమాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసే పనిలో ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో పవన్ నటించిన ‘ఓజీ’ షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే నెల 25న విడుదల కానుంది. ప్రస్తుతమైతే పవన్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆయనపై షూటింగ్ ఇంకా ఓ వారం మాత్రమే మిగిలి ఉన్నట్టు సదరు చిత్ర నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని తెలిపారు.
అలాగే మొత్తం షూటింగ్ కూడా 25 రోజుల్లో కంప్లీట్ కానున్నదని, దాదాపు ఈ నెల చివర్లో గుమ్మడికాయ కొట్టేస్తామని ఆయన చెప్పారు. ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. పవన్‌కల్యాణ్, హరీశ్‌శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. అంతకు మించి ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.. హరీశ్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.