మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో కలిసి పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘బ్రో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో విజయవంతమైన ‘వినోదాయ సీతమ్’ చిత్రానికి రీమేక్ ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్‌తో కలిసి టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. గురువారం ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ మానవరూపంలో ఉన్న దేవుడి పాత్రలో కనిపించనున్నారు.
ఓ యువకుడికి వచ్చిన సమస్యను పరిష్కరించడానికి భువిపై అడుగుపెట్టిన దేవుడిగా పవన్‌కల్యాణ్ పాత్ర సాగనుంది. మోషన్ పోస్టర్లో ఆయన ైస్టెలిష్‌గా కనిపిస్తున్నారు. ‘ఇంకా పదిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. జూలై 28న ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. కేతికశర్మ, ప్రియాప్రకాష్, సముద్రఖని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల.