ఆడా ఉంటా ఈడా ఉంటా అనే తరహా మన నాయికలది. సరిహద్దులు దాటి సెలయేరులా ప్రవహిస్తుంటారు…అన్ని భాషల్లో తమ అందాన్ని పంచుతుంటారు. ఈ క్రమంలో నాయికలు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఒప్పుకున్న సినిమాలకు డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడం. దీంతో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా వాళ్లు వదులుకోవాల్సి ఉంటుంది. అందాల తార పూజా హెగ్డేకూ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే ఎదురైనట్లు కనిపిస్తున్నది. ఆమె స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో నాయికగా నటించాల్సి ఉంది.
ఈ సినిమా గతంలో ‘భవధీయుడు భగత్‌సింగ్’ పేరుతో అనౌన్స్ అయినప్పుడు పూజానే నాయికగా అనుకున్నారు. అయితే పవన్‌కు అప్పటికున్న సినిమాలు, రాజకీయ కార్యకలాపాల వల్ల సెట్స్ మీదకు ఆలస్యంగా వెళ్లింది. ఇటీవలే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’గా పేరు మార్చుకుని లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ఆలస్యంతో పూజా ఈ చిత్రం కోసం కేటాయించిన డేట్స్ కుదరలేదని తెలుస్తున్నది. దీంతో ఈ చిత్రం నుంచి ఆమె ఎగ్జిట్ అయినట్లు సమాచారం. అయితే డేట్స్ ఒక్కటే కారణమా అనేది తెలియాల్సి ఉంది. పవన్, పూజా కాంబోను చూసే అవకాశం ఈ చిత్రంతో లేనట్లే.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ప్రస్తుతం పూజా హెగ్డే మహేష్ బాబు 28వ చిత్రంతో పాటు బాలీవుడ్లో రన్వీర్ సింగ్‌తో ‘సర్కస్’, సల్మాన్ ఖాన్ సరసన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ చిత్రాల్లో నటిస్తున్నది.