Nidhhi Agerwal | పవన్‌కల్యాణ్ ‘హరిహరవీరమల్లు’ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 14 నుంచి మొదలైన విషయం తెలిసిందే. జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఏ.దయాకరరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఎం.రత్నం సమర్పకుడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన యుద్ధ సన్నివేశాలను దర్శకుడు జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్నారు.
ఇదిలావుంటే.. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న నిధి అగర్వాల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆమె పాత్రకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో నిధి బంగారు చీరలో, ఒంటినిండా నగలతో మెరిసిపోతూ కనిపిస్తున్నది.
పేదలకోసం రాజులను కొల్లగొట్టే రాబిన్‌హుడ్ తరహా పాత్రలో పవన్‌కల్యాణ్ నటిస్తున్న ఈ చిత్రంలో బాబీడియోల్, అనుపమ్‌ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కళ: తోట తరణి, నిర్మాణం:
మెగా సూర్య మూవీస్.