పవన్‌కల్యాణ్ నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ ఈ దసరా బరిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. మంగళవారం పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ైస్టెలిష్ గ్యాంగ్‌స్టర్ ఓజస్ గంభీర పాత్రలో పవన్‌కల్యాణ్ కనిపించబోతున్న విషయం తెలిసిందే. తాజా గ్లింప్స్‌లో ప్రతినాయక పాత్రధారి ఇమ్రాన్ హష్మీతో ఓజస్ గంభీర పోరాటాన్ని చూపించారు. ఇందులో పవన్‌కల్యాణ్, ఇమ్రాన్హష్మీ పోటాపోటీగా కనిపించారు. విజువల్స్ కట్టిపడేసేలా ఉన్నాయి. ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్‌రాజ్, శ్రియారెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, నిర్మాతలు: డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి, దర్శకత్వం: సుజీత్.