Pawan Kalyan | ఇప్పుడు ఎక్కడ చూసిన రీమేక్‌ల జోరు కొనసాగుతుంది. సౌత్ నుంచి నార్త్ వరకు ప్రేక్షకులు ఆదరించిన సినిమాలన్ని రీమేక్‌లు అవుతున్నాయి. పలువురు స్టార్ హీరోల సైతం రీమేక్‌లపై మక్కువ చూపుతున్నారు. ఎందుకంటే రీమేక్ సినిమాలకు స్క్రిప్ట్ విషయంలో ఎక్కువ సమయం పట్టదు. షూటింగ్ పక్కా ప్లానింగ్‌తో చెయ్యచ్చు. రిస్క్ కూడా తక్కువ ఉంటుందని భావిస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ కూడా రీమేక్‌లపైనే కన్నేసాడు. ఈయన నుంచి రానున్న సినిమాలలో ఎక్కువగా రీమేక్‌లు ఉండటం గమనార్హం. ఈయన నటించబోయే రీమేక్ సినిమాలేంటో చూద్దాం.
వినోదయ చిట్టం
పి.సముద్రఖని నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘వినోదయ చిట్టం’. గతేడాది తమిళంలో వచ్చిన బెస్ట్ చిత్రాలలో ఇది ఒకటి. ఈ చిత్ర తెలుగు రీమేక్‌లో పవన్‌కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించనున్నారు. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేర్పులు చేస్తున్నాడు. ఈ చిత్రానికి కూడా సముద్రఖని దర్శకత్వం వహించనున్నాడు.
తేరి
తలపతి విజయ్ హీరోగా నటించిన చిత్రం ‘తేరి’. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంతా, అమీజాక్సన్ హీరోయిన్లుగా నటించారు. తెలుగులో ఈ చిత్రం ‘పోలీసోడు’గా డబ్ అయింది. అయినా కూడా ఈ చిత్రాన్ని పవన్ రీమేక్ చేసే అలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
విక్రమ్‌వేద
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విక్రమ్ వేద’. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని గాయత్రి, పుష్కర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్, రవితేజ కలిసి చేయనున్నట్లు టాక్. ఇప్పటికే బాలీవుడ్లో ఈ చిత్రం రీమేక్‌గా తెరకెక్కుతుంది. హృతిక్‌రోషన్, సైఫ్ అలీఖాన్ ఈ రీమేక్‌లలో నటించనున్నారు.
ఇవే కాకుండా ఇప్పటికే విడుదలైన ‘వకీల్‌సాబ్’, ‘భీమ్లానాయక్’ చిత్రాలు కూడా రీమేక్‌గా తెరకెక్కినవే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘హరి హర వీర మల్లూ’ చిత్రంతో బజీగా గడుపుతున్నాడు. క్రిష్ జాగర్లమూడీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.