ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ జర్నీ కొనసాగిస్తున్నాడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan). బిజీ షెడ్యూల్లో ఉన్నా ఏదో ఒక టైంలో తన వ్యాపకాలను గుర్తు చేసుకుంటుంటాడు పవన్ కల్యాణ్. సమయాన్ని బట్టి తనలోని స్కిల్స్ ను బయటపెడుతుంటాడు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నామనేదే మీ డౌటు. షూటింగ్ లొకేషన్లో ఉంటే అభిమానులను కావాల్సిన వినోదాన్ని అందించేందుకు కెమెరాపైనే ఫోకస్ పెట్టే పవన్ కల్యాణ్..ఓ సందర్భంలో ఆ కెమెరాకే పని చెప్పాడు.
తనలో ఓ కెమెరామెన్ (Photographer) కూడా ఉన్నాడని చెప్పకనే చెప్తూ..లొకేషన్లో ఉన్న టీంను ఫొటోలు తీశాడు. ఇంతకీ ఈ అరుదైన సన్నివేశం ఎప్పుడు జరిగిందనుకుంటున్నారా..? భీమ్లా నాయక్ షూటింగ్ లొకేషన్ లో క్లైమాక్స్ సన్నివేశం షూట్ చేస్తున్నపుడు జరిగింది. ఎర్ర తండా లొకేషన్లో భీమ్లానాయక్, డానియల్ శేఖర్ కు మధ్య వచ్చే ఫైట్ సీన్ ఉంటుంది కదా. ఆ సీన్ షూటింగ్ గ్యాప్‌లో సినిమాటోగ్రాఫర్ నుంచి కెమెరా తీసుకున్నాడు పవన్.
భీమ్లా నాయక్‌కు కథ, స్క్రీన్ ప్లే అందించిన త్రివిక్రమ్ (Trivikram), ఆ పక్కనే నటుడు నర్రా శ్రీనివాస్, మరో వైపు రానా కూర్చుని ఉండగా…వారిని పవన్ కెమెరాలో బంధిస్తుంటే చుట్టూ ఉన్నవాళ్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. భీమ్లా నాయక్ లొకేషన్ లో పవన్ కల్యాణ్ సరదాగా కెమెరామెన్‌గా మారిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.