భీమ్లా నాయక్ చిత్రీకరణ తుది అంకంలో ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమాను విడుదల చేశాకే కొత్త సినిమా సెట్ లో అడుగుపెట్టే ఆలోచన చేస్తున్నారు. భీమ్లా నాయక్ ను ఈ నెల 25న విడుదల చేస్తారని ముందు అనుకున్నా..ఆ రోజు రిలీజ్ అవుతుందా లేదా అనేది స్పష్టత లేదు. ఈ సినిమా విడుదల ఖరారై, ప్రచార కార్యక్రమాలు పూర్తి చేశాకే ప్రాజెక్ట్ నుంచి పవన్ బయటకొచ్చినట్లు. అప్పటిదాకా మరో సెట్ లోకి వెళ్లేట్టు కనిపించడం లేదు.
భీమ్లా ..తర్వాత పవన్ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమాను మెగా సూర్యా మూవీస్ నిర్మిస్తుండగా..క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సగ భాగం చిత్రీకరణ పూర్తయింది. లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. సాధారణంగా దర్శకుడు క్రిష్ తన సినిమాలను వేగంగా రూపొందిస్తారు.
ఎంత భారీ చిత్రమైనా తక్కువ సమయంలో తెరకెక్కించడం క్రిష్ ప్రత్యేకత. హరిహర వీరమల్లు భారీ సినిమా. సెట్స్, ప్రోత్సటిక్స్, మేకోవర్.. ఇలా ప్రత్యేక జాగ్రత్తలతో చేయాల్సిన ప్రాజెక్ట్. దీనికి తోడు పాండమిక్ ఇబ్బంది వల్ల ఆలస్యమయింది. ఇటీవల హరిహర టీమ్ తో చర్చలు జరిపిన పవన్ కళ్యాణ్..సెట్స్ మీదకు వెళ్లే తేదీని ఖరారు చేసుకున్నారట.
మార్చి 18 నుంచి షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నారీ స్టార్ హీరో. నిధి అగర్వాల్ నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది. వీటిలో కత్తి యుద్ధాలు, భారీ స్టంట్స్ పవన్ చేస్తున్నారు. రాబిన్ హుడ్ తరహా కథతో హరిహర వీరమల్లు తెరకెక్కుతోందట.