They Call Him OG | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి ఓజీ. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఓ వైపు డిప్యూటీ సీఎంగా పనిచేస్తూనే.. మరోవైపు సినిమా షూటింగ్స్‌తో బిజీబిజీగా గడిపేస్తున్నాడు పవన్ కల్యాణ్. ఓజీ టీం షూట్ లొకేషన్ స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతూ అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
తాజా టాక్ ప్రకారం ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఓజీ షూటింగ్ జరుగుంది. భారీ నౌకతోపాటు ఎయిర్ పోర్టు, స్టైలిష్ కారు స్టిల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సుజిత్ ఓజీలో సూపర్ స్టన్నింగ్, స్టైలిష్ విజువల్స్ ప్లాన్ చేసినట్టు తాజా ఫొటోలు చెప్పకనే చెబుతున్నాయి. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ఓజీ HUNGRYCHEETAH గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. శ్రియారెడ్డి కీలక పాత్రలో నటిస్తుంది. ఈ మూవీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
నెట్టింట లొకేషన్ స్టిల్స్ చక్కర్లు..
OG #TheyCallHimOG Thailand shooting 🔥🏌🏻♂️ pic.twitter.com/nTP79nhOCf
— SENANI Followers (@SenaniFollowers) December 8, 2024
Fahadh Faasil | ఎక్జయిటింగ్ అనిపించిందే చేశానంటున్న పుష్ప యాక్టర్ ఫహద్ ఫాసిల్