Pawan Kalyan | అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి.. మూవీ లవర్స్‌కు ఈ సినిమా గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 1996లో విడుదలైంది. ఈ మూవీ పవన్ కల్యాణ్, సుప్రియకు డెబ్యూ సినిమా అని తెలిసిందే. చేసింది ఒక్క సినిమానే అయినా తెలుగు ప్రేక్షకులకు ఈ జోడీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు సెలబ్రిటీలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది. అలాంటి అరుదైన స్టిల్ ఒకటి ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇంతకీ స్పెషల్ ఏంటనే కదా మీ డౌటు. నేడు విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను టాలీవుడ్ సినీ ప్రముఖులు కలిశారని తెలిసిందే. ఈ సందర్భంగా యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్న సుప్రియ పవన్ కల్యాణ్‌తో ఫొటో దిగింది. ఇటీవలే ఎన్నికల్లో విక్టరీ విజయాన్ని అందుకుని డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలియజేసింది సుప్రియ యార్లగడ్డ.
28 ఏండ్ల తర్వాత ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన స్టిల్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ ఇప్పటికే హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు లైన్లో పెట్టగా.. షూటింగ్ దశలో ఉన్నాయి. మరోవైపు అడివిశేష్, శృతిహాసన్ కాంబోలో వస్తున్న డెకాయిట్ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది సుప్రియ యార్లగడ్డ.
Our producer #Supriya Garu met and congratulated the Hon’ble Deputy CM of Andhra Pradesh Shri. @PawanKalyan Garu and extended her best wishes for the newly formed government in the state of Andhra Pradesh. pic.twitter.com/LbPEj3mzVD
— Annapurna Studios (@AnnapurnaStdios) June 24, 2024