Ustaad Bhagat Singh | స్టార్ హీరో పవన్ కల్యాణ్ నటిస్తున్న కొత్త సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలోనే లాంఛనంగా మొదలైన ఈ సినిమా బుధవారం నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు హరీశ్ శంకర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఎన్నాళ్లో వేచిన ఉదయం పాటను ట్వీట్ చేస్తూ ..తను ఎదురుచూస్తున్న సమయం వచ్చిందని ఆయన తెలిపారు.
హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించినట్లు తెలుస్తున్నది. ఈ సినిమాలో శ్రీలీల నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రంతో పాటు పవన్ క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’, సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్), సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ‘వినోదయ సితమ్’ రీమేక్‌లో నటిస్తున్నారు.
No words to share my excitement today!!
ఇప్పుడే మొదలయ్యింది….😍😍 https://t.co/DYap0sbJQe
— Harish Shankar .S (@harish2you) April 5, 2023