OG | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల షెడ్యూల్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. షార్ట్ గ్యాప్‌లోనే అన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చేస్తూ.. ఒకదాని తర్వాత మరొక మూవీ షూటింగ్లో జాయిన్ అవుతున్నాడు. పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమాల్లో ఓజీ (OG) కూడా ఒకటి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా ఆరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఎలా కనిపించబోతున్నాడో.. ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలే చెబుతున్నాయి. పవన్ కల్యాణ్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న హరిహర వీర మల్లు లేదా హరీష్‌శంకర్ డైరెక్షన్లో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాల కంటే ముందు OGకే ఎక్కువ డేట్స్ కేటాయించాలనుకుంటున్నాడని ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం కేవలం 6 రోజులు డేట్స్ కేటాయించగా.. ఆ షూటింగ్ పార్టు పూర్తయిందని ఇన్సైడ్ టాక్.
ఇక పొలిటికల్ కమిట్మెంట్స్ నుంచి ఖాళీ సమయం దొరికితే పవన్ కల్యాణ్ ఎక్కువగా OG షూటింగ్ కోసం కేటాయించాలని ఫిక్స్ అయినట్టు జోరుగా చర్చ నడుస్తోంది. ఈ లెక్కన పవన్ కల్యాణ్ తాను ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పక్కన పెట్టి మరీ.. సుజిత్‌తో చేస్తున్న ఓజీపై ఫోకస్ పెడుతుండటంతో గ్యాంగ్ స్టర్ డ్రామాపై చాలా ఆసక్తి చూపిస్తున్నాడని చర్చించుకుంటున్నారు సినీ జనాలు. ఇప్పటికే వినోదయ సీతం రీమేక్ షూటింగ్ పూర్తి చేశాడు పవన్ కల్యాణ్.
ఇదంతా చూస్తుంటే ఎప్పుడో ప్రకటించిన హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) కంటే ముందే ఓజీ థియేటర్లలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు మూవీ లవర్స్. ప్రస్తుతం పవన్ కల్యాణ్ నుంచి హరిహర వీర మల్లుకు సంబంధించి షూటింగ్ అప్డేట్ రావాల్సి ఉంది.
Jailer | రజినీకాంత్ జైలర్ రిలీజ్ టైం ఫిక్సయినట్టే..
Agent | ఏజెంట్ నుంచి ఊర్వశి రౌటేలా వైల్డ్ సాలా వీడియో సాంగ్