RSS worker | ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య కేసు నిందితుడు ఎన్కౌంటర్.. తీవ్ర గాయాలు
RSS worker : ఉత్తరప్రదేశ్‌లోని దేవరియాలో ఆదివారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య కేసులో నిందితుడిగా ఉన్న దీపక్ తివారి గాయపడ్డాడు.
RSS worker : ఉత్తరప్రదేశ్‌లోని దేవరియాలో ఆదివారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య కేసులో నిందితుడిగా ఉన్న దీపక్ తివారి గాయపడ్డాడు. ఈ ఘటన యూపీలోని లార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుతావర్ మోద్ ప్రాంతంలో జరిగింది. ఎన్కౌంటర్లో దీపక్ తివారి కాలికి గాయం కాగా.. అతడి నుంచి ఒక దేశీ పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలివి.
భిఖంప్ గ్రామానికి చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త రామేష్ తివారికి, దీపక్ తివారి కుటుంబానికి మధ్య కొంతకాలంగా ఆస్తి విషయంలో విబేధాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అక్టోబర్ 1న దీపక్ తివారి.. మరికొందరు బంధువులతో కలిసి రామేశ్వర్ తివారి ఇంటిపైకి వెళ్లి అతడిపై దాడి చేశారు. కర్రలు, రాడ్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో రామేశ్వర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని వెంటనే కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ్నుంచి మెరుగైన చికిత్స కోసం దేవరియాలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రామేశ్వర్ భార్య అమృతా దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు సంజయ్ తివారి, దీపక్ తివారి, ప్రంజల్ తివారి, అభినిత్ తివారి, ఆదిత్య తివారి, నిఖిల్ తివారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిని అరెస్టు చేసేందుకు పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితుల కోసం గాలిస్తుండగా.. దీపక్ తివారి పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో అతడి కాలికి గాయమైంది. అనంతరం దీపక్ తివారిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా ఉన్న నలుగురు పోలీసులను కూడా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Deoria
- Encounter
- pistol
- RSS worker
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

