‘ఓజీ’ విజయంతో మంచి జోష్ మీదున్నారు పవన్‌కల్యాణ్. తన నెక్ట్స్ సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్‌ని కూడా పూర్తి చేసి, ప్రస్తుతం కొత్త కథలు వినే పనిలో పడ్డారాయన. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు పైడిపల్లి వంశీ ఇటీవలే పవన్‌కు ఓ కథ చెప్పారట. సామాజిక అంశాలతో కూడుకున్న ఈ సోషల్ డ్రామా పవన్‌కల్యాణ్‌కి బాగా నచ్చిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
ఇదిలావుంటే.. గతంలో బాలీవుడ్స్టార్ అమీర్‌ఖాన్‌కు పైడిపల్లి వంశీ ఓ కథ చెప్పారు. అమీర్ ఓకే చేశారు కూడా. కానీ ఎందుకో ఆ సినిమా పట్టాలెక్కలేదు. తర్వాత అదే కథను మరో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌కి కూడా చెప్పారట. ఆయన మాత్రం కథ విని రిజక్ట్ చేశారట. ఇప్పుడు పవన్‌కి చెప్పి పైడిపల్లి వంశీ ఒప్పించుకున్న కథ అదేనంటూ ఫిల్మ్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.